Vijaya Sai Reddy : చంద్రబాబూ కలకాలం వర్ధిల్లు
విజయ సాయి రెడ్డి ట్వీట్
Vijaya Sai Reddy : వైసీపీలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఒక రకంగా పార్టీకే కాదు సీఎం వైఎస్ జగన్ రెడ్డికి రెండు కళ్లు. ఢిల్లీలో ఏదైనా మాట్లాడాలన్నా కేంద్రంతో చర్చలు జరపాలన్నా ఎంపీ ఉండి తీరాల్సిందే. అంతటి ప్రాముఖ్యత ఆయనకు ఉంది. ఇదే సమయంలో గత కొంత కాలం నుంచీ విజయ సాయి రెడ్డి చేసే ప్రతి ట్వీట్ వైరల్ గా మారడం జరుగుతోంది.
ప్రత్యేకించి ఆయన టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పాసే తీరు, పదాల్లో ప్రాసలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా ఉంటాయి. దీంతో ఎంపీ ఏం ట్వీట్ చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ ఆ పార్టీ వర్గాలలోనే కాదు ప్రతిపక్షాల్లో కూడా ఎదురు చూసే వారున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు.
తాజాగా ఆయన నారా చంద్రబాబు నాయుడి గురించి చేసిన ట్వీట్ హల్ చల్ చేస్తోంది. కారణం ఏమిటంటే ఈసారి ఎంపీ విజయ సాయి రెడ్డి టోన్ మార్చారు. ట్వీట్ కూడా చాలా పొలైట్ గా మార్చేశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాబు చల్లంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. మొత్తంగా నిత్యం విమర్శలు చేసుకునే ఈ ఇద్దరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం విశేషం.
Also Read : గాడి తప్పిన జగన్ పాలన