Vijaya Sai Reddy : ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్స్
Vijaya Sai Reddy : వైఎస్సార్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. రాష్ట్రంలో కాషాయ పార్టీకి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఎంపీ స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఆ పార్టీని జనం ఆదరించరని పేర్కొన్నారు. గతంలో ఏపీ వాసులకు ఎన్నో హామీలు కేంద్రం ఇచ్చిందని కానీ ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పనులు చేస్తేనే ఆదరిస్తారని స్పష్టం చేశారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ , ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీల గురించి ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ ఎంతగా ప్రయత్నం చేసినా లేదా జగన్ రెడ్డిని, వైసీపీని టార్గెట్ చేసినా వర్కవుట్ కాదని తేల్చి చెప్పారు విజయ సాయి రెడ్డి(Vijaya Sai Reddy). తమ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. ఇవాళ తాము అమలు చేస్తున్న నాడు నేడు దేశానికే ఆదర్శంగా మారిందని తెలిపారు ఎంపీ. ఇకనైనా విమర్శలు మానుకోవాలని సూచించారు ఎంపీ.