Anantapur SP : ఎంపీకి క్లీన్ చిట్ వీడియో బక్వాస్
ప్రకటించిన ఎస్పీ ఫక్కీరప్ప
Anantapur SP : తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది ఎంపీ వీడియో. పూర్తి నగ్నత్వంతో ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా హల్ చల్ చేస్తూనే ఉంది.
దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో వీడియో ఒరిజనల్ కాదని మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేశారంటూ ప్రకటించారు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప(Anantapur SP) . బాధితులమంటూ తమ వద్ద ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.
ఆగస్టు 4న ఐ టీడీపీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో దీనిని పోస్ట్ చేశారంటూ వెల్లడించారు ఎస్పీ. యుకె వొడా ఫోన్ +447443703968 మొబైల్ నుంచి వీడియోను అప్ లోడ్ చేశారంటూ తెలిపారు.
ఆయన వీడియోతో మాట్లాడారు. ఆరోజు తెల్ల వారుజామున 2.07 గంటలకు షేర్ చేశారన్నారు. తమ దర్యాప్తులో ఈ నంబర్ యుకెదిగా తేలిందన్నారు ఫక్కీరప్ప.
ఇది ఇంటర్నేషనల్ నెంబర్ కు సంబంధించింది కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఈ వీడియోను మార్ఫింగ్ చేశారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.
చాలా సార్లు ఫార్వర్డ్, రీ పోస్టింగ్ చేశారంటూ చెప్పారు ఎస్పీ. పూర్తిగా ఎడిటింగ్ చేసి ఎంపీని ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. బాధితులెవరూ ముందుకు రాలేదని అందుకే కేసు నమోదు చేయలేదన్నారు.
వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి కోసం వొడా ఫోన్ ఐడియా ప్రొవైడర్ కు లేఖ రాశామని వెల్లడించారు ఎస్పీ. ఇదిలా ఉండగా ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఒకరు ఫిర్యాదు చేశారు
దీంతో కొంత కాలంగా హల్ చల్ చేసిన ఎంపీ వ్యవహారానికి తాత్కాలికంగా ముగింపు పలికినట్లయింది.
Also Read : వరవరరావుకు బెయిల్ మంజూరు