MSRTC: ఫోన్‌ లో క్రికెట్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్‌

ఫోన్‌ లో క్రికెట్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్‌

MSRTC : ఐపీఎల్ సీజన్ మొదలవడంతో క్రికెట్ అభిమానులు హద్దులు దాటుతున్నారు. బెట్టింగ్ రూపంలో యువత, ఉద్యోగం, పనులు ప్రక్కన పెట్టి క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కు బానిసలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత మరచి… ఫోన్‌ లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబయి- పుణె మార్గంలో ఎంఎస్ఆర్టీసీ(MSRTC)కు చెందిన ‘ఈ-శివనేరీ’ బస్సులో డ్రైవర్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేసాడు. అయితే ఐపీఎల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను ప్రయాణికుల్లో ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో ఆ వీడియోను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించారు.

MSRTC Driver Viral

ముంబయి- పుణె మార్గంలో ఎంఎస్ఆర్టీసీకు చెందిన ‘ఈ-శివనేరీ’ బస్సులో డ్రైవర్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేసాడు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి… రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయిక్‌ కు పంపారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి… ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తోపాటు రవాణాశాఖ మంత్రికీ ట్యాగ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సర్నాయిక్‌… వెంటనే డ్రైవర్‌ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతను విస్మరించాడని పేర్కొంటూ… అధికారులు అతడిని విధుల నుంచి డిస్మిస్‌ చేశారు. ఓ ప్రైవేటు సంస్థ కింద అతడు పనిచేస్తుండగా… దానికీ రూ.5,000 జరిమానా విధించారు.

‘‘ముంబయి- పుణె మార్గంలో యాక్సిడెంట్‌ రహిత సర్వీసుగా ‘ఈ-శివనేరీ’కి మంచి పేరుంది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవు. ఎంఎస్‌ఆర్టీసీ కింద పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలు తమ డ్రైవర్లకు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. ఆటో, టాక్సీ డ్రైవర్ల విషయంలోనూ ఫోన్‌ వాడకంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటువంటివాటిని కట్టడి చేసేందుకు త్వరలోనే కొత్త నిబంధనలను ప్రవేశపెడతాం’’ అని రవాణాశాఖా మంత్రి సర్నాయిక్‌ చెప్పారు.

Also Read : Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ చీఫ్‌ గా రాజీవ్ చంద్రశేఖర్

Leave A Reply

Your Email Id will not be published!