Mudragada Padmanabham : పవన్ కళ్యాణ్ పై ముద్రగడ గరం
సుదీర్ఘ లేఖ రాసిన ఏపీ నేత
Mudragada Padmanabham : ఏపీ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ చీఫ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ఎవరి కోసమని పార్టీ పెట్టావో జనానికి తెలుసన్నారు. కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడిగా మారుతున్నారంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ పై.
అసలు నువ్వు నాయకుడివేనా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు. ఎంత మందికి నార తీశావో, ఎంత మందికి గుండు కొట్టించావో చెప్పాలన్నారు ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham). చెప్పడం కాదు కానీ ఎంత మందిని చెప్పుతో కొట్టావో కొంచెం చెబితే రాసుకుంటానని సెటైర్ వేశారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. అసలు పార్టీని ఎందుకు పెట్టావో నీకే తెలియదు. ఇక రాష్ట్రంలో ఎన్నికల గురించి మాట్లాడటం , ఇతరులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
కేవలం ఎన్నికల సమయం వచ్చినప్పుడే వస్తావని, ఆ తర్వాత గాయబ్ అవుతావంటూ మండిపడ్డారు. నీలాంటి వాళ్లను జనం నమ్మరని తెలుసు కోవాలన్నారు. కాపు కులం పేరుతో ఓట్లు రాబాట్టు కోవాలని చూస్తున్నది నీవు కాదా అని ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టడం నీ లక్ష్యమా అని నిలదీశారు పవన్ కళ్యాణ్ ను. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. మరి నువ్వు ఎట్లా లీడర్ వి అనుకుంటున్నావని అన్నారు. నీ పార్టికే గుర్తింపు లేదు..మరి సీఎం ఎట్లా అవుతావో చెప్పాలని డిమాండ్ చేశారు ముద్రగడ.
Also Read : Smita Sabharwal : స్మితం జన హితం