Mudundi Ramakrishna Raju: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎంఆర్ రాజు కన్నుమూత
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎంఆర్ రాజు కన్నుమూత
Mudundi Ramakrishna Raju : పద్మశ్రీ పురస్కార గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త, రేడియాలజీ పరిశోధకుడు ముదుండి రామకృష్ణంరాజు (ఎంఆర్ రాజు) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో 95 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. 1931లో జన్మించిన ఎంఆర్ రాజు… ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. అనంతరం స్వామీ జ్ఞానానంద వద్ద పీహెచ్‌డీ చేసి, అమెరికాలోని లాస్‌అల్మాస్ డిఫెన్స్ ల్యాబరేటరీలో శాస్త్రవేత్తగా పనిచేశారు. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీపై పరిశోధనలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1974లో పెదఅమిరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్టు, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థను ఏర్పాటుచేసి కొన్నేళ్ల పాటు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఎంఆర్ రాజు సన్నిహితులు.
Mudundi Ramakrishna Raju – రేడియేషన్ థెరపీపై పరిశోధనలతో ప్రత్యేక గుర్తింపు
క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీపై పరిశోధనలు చేసిన ఎంఆర్ రాజు… 2006లో ఆసుపత్రి ప్రాంగణాన్ని కలాం సందర్శించి రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించారు. 2013లో పద్మశ్రీ పురస్కారం, 2024లో మహాత్మాగాంధీ శాంతి పురస్కారం ఎంఆర్ రాజును వరించాయి. ఆయన అంత్యక్రియలను స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు.
Also Read : BJP: అమ్మ పేరుతో మొక్కలు నాటండి బీజేపీ నేతల పిలుపు
