Mukesh Agnihotri : ఒకప్పుడు జర్నలిస్ట్ నేడు డిప్యూటీ సీఎం
ప్రమాణం చేయనున్న ముఖేష్ అగ్నిహోత్రి
Mukesh Agnihotri : సామాన్య కుటుంబానికి చెందిన సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయన తండ్రి కండక్టర్. చదువు కోసం పాలను అమ్మారు. ఇక మరో ఆసక్తికర సన్నివేశం ఏమిటంటే ఒకప్పుడు జర్నలిస్టుగా పని చేసి ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారిన ముఖేశ్ అగ్నిహోత్రి ఊహించని రీతిలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో పాత కాలం నాటి సంప్రదాయాలకు స్వస్తి పలికింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా కొలువు తీరనున్నారు అగ్నిహోత్రి. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ముఖేష్ అగ్నిహోత్రిని(Mukesh Agnihotri) ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలమైన బ్రాహ్మణ వర్గానికి ప్రయారిటీ ఇచ్చినట్లయింది.
ఇదే సమయంలో రాష్ట్రంలో రెండు ఆధిపత్య వర్గాల మధ్య సమతుల్యతను సాధించినట్లయింది. ఒకరు బ్రాహ్మణులైతే మరొకరు రాజ్ పుత్ లు. ఇక సీఎంగా నియమితులైన సుఖు రాజ్ పుత్ వర్గానికి చెందిన వ్యక్తి. జర్నలిస్టుగా మారిన రాజకీయవేత్త. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు.
సంతోష్ ఘర్ అని పిలువబడే హరోలీ నుండి వరుసగా ఐదో సారి ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేశారు ముఖేశ్ అగ్నిహోత్రి. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో అక్టోబర్ 9, 1962లో పుట్టారు. వీర్ ప్రతాప్ అనే హిందీ దినపత్రికకు సిమ్లా కరెస్పాండెంట్ గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు.
1993లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన హిందీ దినపత్రిక జనసత్తాలో చేరాడు. రాజకీయాల్లోకి చేరే ముందు 2003 వరకు రాష్ట్ర బ్యూరో చీఫ్ గా ఉన్నారు.
Also Read : కన్నడ నాట కాంగ్రెస్ జెండా ఎగరాలి