Mukesh Kumar Meena: ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు – సీఈవో ముకేశ్‌కుమార్ మీనా
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు - సీఈవో ముకేశ్‌కుమార్ మీనా
Mukesh Kumar Meena: 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుది పోలింగ్ శాతం వివరాలను ఆయన వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని.. రీపోలింగ్‌పై ఏమీ చెప్పలేదని సీఈవో వివరించారు.
Mukesh Kumar Meena Comment
గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో చెప్పారు.
Also Read : Election Commission of India: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్, డీజీపీకి సమన్లు !