IPL Brand Value : బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్
ఐపీఎల్ లో రిలయన్స్ గ్రూప్ టాప్
IPL Brand Value : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఇండియాలో 2008లో స్టార్ట్ అయ్యింది. రాను రాను రిచ్ లీగ్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన లీగ్ గా పేరొందింది. 2016-2018లో ఐపీఎల్ వాల్యూ(IPL Brand Value) మరింత పెరిగింది.
ఇదే ఏడాది యుఎస్ $4.16 బిలియన్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా దీని సంఖ్య 2017లో $5.3 బిలియన్లకు చేరుకోగా 2018లో దాని వాల్యూ $6.13 బిలియన్లకు పెరిగిందని డఫ్ అండ్ ఫెల్ఫ్స్ నివేదిక పేర్కొంది.
ప్రపంచ దిగ్గజ కంపెనీ స్టార్ టీవీ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. పలు భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ ఎత్తున ఆదాయం సమకూరింది.
ఇక లండన్ కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ నిర్వహించిన మరో స్వతంత్ర నివేదిక ప్రకారం 2017లో ఐపీఎల్ ముగిశాక దాని వాల్యూ 37 శాతం పెరిగింది. ఒక సీజన్ లో బిలియన్ మార్క్ దాటడం విశేషం.
ఇక ఐపీఎల్ లో ఇప్పటి వరకు పాల్గొన్న జట్ల యాజమాన్యాల పరంగా చూస్తే వాటి బ్రాండ్ వాల్యూ(IPL Brand Value) అనూహ్యంగా పెరగడం విస్తు పోయేలా చేసింది.
మొత్తం జట్లలో ఏకంగా రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ టాప్ లో నిలిచింది.
దాని బ్రాండ్ వాల్యూ ఏకంగా రూ. 2, 700 కోట్లు. ఇక రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2, 500 కోట్లు కాగా మూడో స్థానంలో షారుఖ్ ఖాన్, జూహీ చావ్లాకు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 543 కోట్లుగా ఉంది.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ వాల్యూ రూ. 536 కోట్లు ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ వాలయూ రూ. 442 కోట్లు గా ఉంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ వాల్యూ రూ. 370 కోట్లు ఉంటే పంజాబ్ కింగ్స్ వాల్యూ రూ. 318 కోట్లు ఉండగా రాజస్తాన్ రాయల్స్ వాల్యూ రూ. 249 కోట్లుగా ఉంది. తాజాగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి.
వాటి వాల్యూ ఇంకా తెలియాల్సి ఉంది. అవి గుజరాత్ టైటాన్స్ కాగా లక్నో సూపర్ జెయింట్స్ .
Also Read : టైటిల్ స్పాన్సర్‌షిప్ తో కోట్లే కోట్లు