Sachin Pilot : హంతకుల‌కు శిక్ష ప‌డాల్సిందే – స‌చిన్ పైల‌ట్

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా టైల‌ర్ కేసు విచారించాలి

Sachin Pilot : రాజ‌స్తాన్ లోని ఉద‌య్ పూర్ లో టైల‌ర్ హ‌త్య ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. ఈ హ‌త్య‌ను ప‌లువురు ఖండించారు. హ‌త్య‌కు పాల్ప‌డిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ఎందుకంటే వారు చంప‌డ‌మే కాదు వీడియో కూడా పోస్ట్ చేశారు. ఆపై ప్ర‌ధాన‌మంత్రి మోదీని కూడా ఇలాగే చంపుతామంటూ బెదిరించారు. దీనిపై ఉగ్రవాద సంస్థ‌ల‌కు ఏమైనా లింకులు ఉన్నాయామోన‌ని కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది.

జాతీయ ఉగ్ర‌వాద సంస్థ (ఎన్ఐఏ)కు అప్ప‌గించింది. మ‌రో వైపు రాజ‌స్థాన్ పోలీసులు కూడా విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot) గురువారం స్పందించారు.

టైల‌ర్ ను హ‌త్య చేయ‌డాన్ని ఉగ్ర‌దాడిగా ప‌రిగ‌ణిస్తామ‌ని అన్నారు. ఎవ‌రో వెంట‌నే గుర్తించాల‌ని, త్వ‌ర‌లోనే శిక్ష పూర్తి చేయాల‌ని కోరారు. హంత‌కుల‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దేశం మొత్తానికి ఆద‌ర్శంగా నిలిచేలా శిక్ష విధించాల‌ని స్పష్టం చేశారు స‌చిన్ పైల‌ట్.

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలా జ‌ర‌గ‌డం దారణం. ఈ హంత‌కులు మాన‌వ‌త్వానికి సంబంధించిన అన్ని ప‌రిమితుల‌ను దాటార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

హ‌త్య , దానిని అమ‌లు చేసిన విధానం ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించింది. ఆ శిక్ష విధించ‌డం దేశంలో ఎవ‌రైనా అలాంటి ఆలోచ‌న చేసేందుకు సైతం భ‌య‌ప‌డేలా ఉండాల‌న్నారు స‌చిన్ పైల‌ట్.

దీనికి బాధ్యులైన వ్య‌క్తులు, సంస్థ‌ల‌ను గుర్తించి శాశ్వ‌తంగా ముగించాల్సి ఉంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం కూడా ఉగ్ర‌దాడిగానే ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు చెప్పారు.

Also Read : ఉద‌య్ పూర్ లో ఉద్రిక్త‌త భారీ నిర‌స‌న‌

Leave A Reply

Your Email Id will not be published!