Mutyapu Pandiri Vahanam : ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు
కాళీయ మర్దన ఆకారంలో శ్రీ మలయప్ప
Mutyapu Pandiri Vahanam : తిరుమల – పుణ్య క్షేత్రమైన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
మాడ వీధుల్లో ఘనంగా వాహన సేవ కొనసాగింది. ఈ సందర్బంగా వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని వాహన సేవలో దర్శించుకుని పునీతులయ్యారు.
Mutyapu Pandiri Vahanam in Tirumala
అనంతరం రాత్రి శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియ జేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది.
ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామి వారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమ కూర్చుతుంది.
వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ(TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి పాల్గొన్నారు.
Also Read : Asaduddin Owaisi Jaleel : మహిళా బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం