Halla Bol Protest : శివాజీకి అవమానం వెల్లువెత్తిన ఆగ్రహం
మహా వికాస్ అఘాడీ భారీ నిరసన..ఆందోళన
Halla Bol Protest : మరాఠా మరోసారి ఆందోళనలు, నిరసనలతో హోరెత్తింది. వేలాది మంది జనం నిప్పులు చెరిగారు. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో పాటు రాష్ట్రంలో కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే, బీజేపీ సంయుక్త సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా గవర్నర్ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
చివరకు కోష్యారీ కూడా క్షమాపణలు చెప్పారు. అయినా శివసేన (ఉద్దవ్ ) , కాంగ్రెస్, ఎన్సీపీ మహా వికాస్ అఘాడీ ఆధ్వర్యంలో శనివారం మహారాష్ట్రలో నిరసన చేపట్టారు. రహదారులన్నీ వ్యతిరేక నినాదాలతో(Halla Bol Protest) హోరెత్తాయి. ముంబైలో చేపట్టిన భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాయకులు, కార్యకర్తలు. ఈ ఆందోళనలో శివసేన బాల్ ఠాక్రే చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ పాల్గొన్నారు.
ఇదే సమయంలో ఏక్ నాథ్ షిండే సీఎంగా కొలువు తీరాక రాష్ట్రానికి రావాల్సిన కీలకమైన ప్రాజెక్టులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయని ఆరోపించారు. ప్రధానంగా గుజరాత్ కు వెళ్లి పోతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
మరాఠా యోధుడు కోట్లాది మందికి ఆరాధ్యుడైన శివాజీ మహారాజ్ ను గవర్నర్ కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
ఇది పూర్తిగా కావాలని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్. గవర్నర్ కోష్యారీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : భుట్టో కామెంట్స్ పై బీజేపీ నిరసన