Mynampally Hanumantha Rao : కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి
తనయుడితో ఖర్గే సమక్షంలో
Mynampally Hanumantha Rao : న్యూఢిల్లీ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు తెర దించారు. న్యూఢిల్లీలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో మైనంపల్లి హనుమంత రావుతో(Mynampally Hanumantha Rao) పాటు తనయుడు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.
Mynampally Hanumantha Rao Joined in Congress
ఇదిలా ఉండగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే సమయంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 119 సీట్లకు సంబంధించి 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు.
ఇందులో తనకు సీటు లభించినా తన తనయుడికి సీటు రాక పోవడంపై భగ్గుమన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా బీఆర్ఎస్ పార్టీపై , రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఒకనాడు స్లిప్పర్లతో తిరిగిన హరీష్ కు ఇవాళ లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో హరీశ్ ఎక్కడ నిలబడినా ఓడించి తీరుతానంటూ ప్రకటించారు. దీంతో పార్టీ నుండి మైనంపల్లిని సస్పెండ్ చేసింది బీఆర్ఎస్.
Also Read : Vinayaka Laddu : గణేశుడి ప్రసాదం ముస్లింల స్వంతం
