Mynampally Hanumantha Rao : ‘మైనంపల్లి’ షాకింగ్ కామెంట్స్
గులాబీ దళంలో కలకలం
Mynampally Hanumantha Rao : ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల లొల్లి హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు అధికార పార్టీకి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీలో ధిక్కార స్వరం వినిపించడం కలకలం రేపింది. మంత్రి చామకూర మల్లారెడ్డిపై ఫైర్ అయ్యారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ లో మంత్రికి వ్యతిరకంగా ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో నివాసంలో వీరు సమావేశం అయ్యారు. మంత్రి ఒంటెద్దు పోకడపై నిప్పులు చెరిగారు. పని చేసిన కార్యకర్తలు, నాయకులకు పదవులు దక్కక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన వాళ్లకే పదే పదే పదువులు ఇప్పిస్తున్నారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ఇన్ చార్జి మంత్రిపై పూర్తి బాధ్యత ఉంటుందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎంకు తెలియక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వారం రోజుల నుంచి ఈ తతంగం జరుగుతోందని, కొంచెం సేపు ఆపాలని సూచించామన్నారు.
అంతర్గతంగా మాట్లాడుకుందామని చెప్పామన్నారు. కావాలని వాళ్ల వాళ్లకే పదవులు ఇచ్చుకున్నారని ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నిలదీశారు మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanumantha Rao) . సిస్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కష్ట పడిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు.
నాకు సత్తా ఉంది. కింద పడినా తిరిగి పోరాడుతానని అన్నారు మైనంపల్లి హన్మంతరావు. ప్రతి పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాడర్ అసంతృప్తికి లోనైతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ప్రియాంక సీరియస్ కాంగ్రెస్ పై ఫోకస్