N Chandrababu Naidu : గాడి తప్పిన జగన్ పాలన
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
N Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనకు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసిందన్నారు. ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని త్వరలో జరిగే ఎన్నికల్లో తాము పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు.
ఏం సాధించారని విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారంటూ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు(N Chandrababu Naidu). ఏపీ రాష్ట్రానికి జగన్ చేసింది ఏమీ లేదన్నారు. కేవలం అప్పులు మాత్రమే చేశారని, ఇప్పటి వరకు ఆయనకు విజన్ అంటూ లేకుండా పోయిందని మండిపడ్డారు. తాము గనుక అధికారంలో ఉంటే ఇప్పటికే ఏపీకి ఎన్నో పరిశ్రమలు తీసుకు వచ్చే వాడినని చెప్పారు. ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
అమరావతి పై కక్ష కట్టారని మొదట మూడు రాజధానులు చేస్తామని ప్రకటించారని, ఇప్పుడు విశాఖ నుంచి పాలన సాగిస్తానంటూ కొత్త రాగం ఎత్తుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల చిత్తశుద్ది లేకుండా మాట్లాడటం జగన్ కు, వైసీపీ మంత్రులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు(N Chandrababu Naidu). రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందని.. సీఎం ఎప్పుడేం మాట్లాడతారో తెలియదని మండిపడ్డారు చంద్రబాబు. సెప్టెంబరులో విశాఖ వెళ్తానని సీఎం చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. అక్కడ జనం ముఖ్యమంత్రిని చూస్తే భయపడుతున్నారని అన్నారు చంద్రబాబు. బద్వేలు టీడీపీ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత.
Also Read : ఎన్నికలప్పుడే కార్మికులు గుర్తొస్తారా