Naatu Naatu Chandrabose : జయహో చంద్రబోస్..కీరవాణి
నాటు నాటు సాంగ్ సెన్సేషన్
Naatu Naatu Chandrabose : తెలుగు సినిమా గర్వ పడుతోంది. ఇవాళ భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ తెలుగు వాడి సత్తా ఏమిటో చాటి చెప్పింది. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ప్రాణం పెట్టేలా చేసిన ఘనత దర్శకుడితో పాటు గేయ రచయిత చంద్రబోస్ , సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి(Naatu Naatu Chandrabose).
ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు పని చేశారు. చంద్రబోస్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఆయనలోని ప్రతిభను ముందుగా గుర్తించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో వందల పాటలు రాసి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు చంద్రబోస్. ఇక ఎంఎం కీరవాణి విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు.
ఈ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ కు ప్రాణం పోశారు. ఈ పాటను నెల రోజుల పాటు రాసేందుకు కష్టపడ్డారు గేయ రచయిత చంద్రబోస్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కష్టపడ్డారు. ఈ పాటను రూ. 20 కోట్లు ఖర్చు చేసి తీశారు. నాటు నాటు సాంగ్ ను ఉక్రెయిన్ లో చిత్రీకరించారు.
యుద్దం జరగక ముందు దీనిని అక్కడ షూట్ చేశారు. ఈ పాటను మనసు పెట్టి పాడారు రాహుల్ సిప్లీగంజ్ , కాల భైరవ. పాటకు అద్భుతంగా డ్యాన్స్ లు చేసి ఆకట్టుకునేలా చేశారు నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఈ సందర్బంగా మెగాస్టార్ స్పందించారు..ఆస్కార్ అందడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : నాటు నాటు పాటకు ఆస్కార్