Nadendla Manohar : ఎన్నికలకు సిద్దం బాబుతో స్నేహం
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : ఏపీలో రాజకీయాలు త్వరితగతిన మారుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దానికి తెర లేపారు నేతలు. తాజాగా జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావాడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై జనసేన పార్టీ కీలక నాయకుడు , మాజీ ఉమ్మడి ఏపీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. భావ సారూప్యత కలిగిన ప్రతి ఒక్కరితో కలిసి పోయేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై పవన్ కళ్యాణ్ బాబుతో(Pawan Kalyan) భేటీ అయ్యారని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికలకు తాము సిద్దం అవుతున్నామని చెప్పారు. చంద్రబాబుతో చర్చలు జరిపారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేనాని యత్నిస్తున్నారంటూ వెల్లడించారు నాదెండ్ల మనోహర్. తాము ఏనాడూ పదవులు కోరుకోలేదని, కేవలం ఏపీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పారు. పవన్ ఉన్నట్టుండి చంద్రబాబు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలిసే పోటీ చేస్తారా లేక విడిగా యుద్దం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ఈ ప్రయాణం అద్భుతం – మోదీ