Nadendla Manohar Pawan : జ‌న‌సేనానికి ‘నాదెండ్ల‌’ బ‌లం

అన్నీ తానై న‌డిపిస్తున్న మ‌నోహ‌ర్

Nadendla Manohar Pawan : స‌మున్న‌త ల‌క్ష్యం కోసం ఏర్పాటైంది జ‌న‌సేన పార్టీ. మేధావులు దీని వెనుక ఉన్నారు. స‌రిగ్గా ఇదే రోజు మార్చి 14, 2014లో జ‌న‌సేన‌ను ఏర్పాటు చేశారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

పార్టీకి సంబంధించి కీల‌కంగా మారారు మాజీ ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్. ఆయ‌న నాదెండ్ల భాస్క‌ర్ రావు త‌న‌యుడు. జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు పార్టీకి గుండె కాయ లాగా మారారు మ‌నోహర్. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగి ఉన్నారు నాదెండ్ల‌. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పార్టీ నిర్వ‌హ‌ణ‌, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం, స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇత‌ర పార్టీల‌తో మాట్లాడ‌టం, పార్టీకి సంబంధించిన ముసాయిదా త‌యారీలో, పార్టీ ప్ర‌చార , నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను నాదెండ్ల మ‌నోహ‌ర్ చేస్తున్నారు.

అటు జ‌గ‌న్ కు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అయితే ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌నోహ‌ర్ (Nadendla Manohar Pawan) బ‌లంగా మారారు. నిత్యం వార్త‌ల్లో ఉండేలా , అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేరువ‌య్యేలా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్.

జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండాగా ముందుకు వెళ్లేలా జ‌న‌సేన పార్టీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్ర‌ధానంగా సీరియ‌స్ ఇష్యూస్ ను ఫోక‌స్ చేయ‌డంలో వ్యూహాలు ప‌న్నుతున్నారు మ‌నోహ‌ర్. ఏది ఏమైనా ఇవాళ మ‌చిలీప‌ట్నం సాక్షిగా జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నేది చూడాలి.

Also Read : అంద‌రి చూపు జ‌న‌సేన వైపు

Leave A Reply

Your Email Id will not be published!