Nadendla Manohar : జగన్ ఇదే నా మీ సంస్కారం – నాదెండ్ల
పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలా
Nadendla Manohar : జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ఆపై పవన్ కళ్యాణ్ లాగా నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యలను మార్చలేమంటూ నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం కలకలం రేపింది. జనసేన పార్టీ నేతలను, ఆ పార్టీ చీఫ్ ను సైతం విస్తు పోయేలా చేసింది. దీనిపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకించి విద్యార్థులు హాజరైన మీటింగ్ లో ఇలా మాట్లాడితే వాళ్లకు ఎలాంటి మెస్సేజ్ ఇచ్చిన వారవుతారో గమనించారా అంటూ సీఎంను సూటీగా ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar). జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా అత్యంత నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
పాలసీల మీద సమాధానం చెప్పకుండా దాట వేయడం ఎంత వరకు సబబు అని పేర్కొన్నారు. రాజకీయాలలో అధికారం, విపక్షం అంటూ ఉండడం సహజమేనని దానిని గౌరవ ప్రదంగా తీసుకోవాలే తప్పా ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : Pawan Kalyan : సీఎంకు తెలుగు రాక పోతే ఎలా