Nalini Ex DSP : సీఎంను కలిసిన మాజీ డీఎస్పీ
పుస్తకాలను అంజదేసిన నళిని
Nalini Ex DSP : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన కెరటంగా పేరు పొందిన మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సీఎంగా సంతకం చేసిన వెంటనే జరిగిన సమీక్షలో నళిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. దీంతో నళిని మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
Nalini Ex DSP Met CM
తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం పణంగా పెట్టారు. ఆ తర్వాత పోలీసు శాఖ లో చేరినా అక్కడ ఉండలేక పోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ లేని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏపీ విడి పోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా గతంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ కానీ, ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ఎవరూ నళినిని పట్టించు కోలేదు.
ఉన్నట్టుండి మాజీ డీఎస్పీ నళిని చేసిన త్యాగాన్ని గుర్తు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తన సమీక్షలో ఎందుకు ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వకూడదో చెప్పాలని ఆదేశించారు. ఈ సందర్బంగా తన గురించి ప్రస్తావించిన రేవంత్ రెడ్డికి భావోద్వేగంతో లేఖ రాశారు. అది కూడా వైరల్ గా మారింది.
తాజాగా సీఎంను కలవడంతో మరోసారి సంచలనంగా మారారు మాజీ డీఎస్పీ నళిని.
Also Read : MLC Kavitha : వాహనాలను దాచాల్సిన అవసరం లేదు