Nalini Sriharan : ముందస్తు విడుదల కోసం కోర్టుకు నళిని
రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషి
Nalini Sriharan : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలకమైన దోషిగా ఉన్నారు నళిని శ్రీహరన్. క్షమాభిక్షను ప్రసాదించమని కోరారు ఇప్పటికే.
ముందస్తు విడుదల చేయాలంటూ శుక్రవారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఇప్పటికే ముందస్తు విడుదల కోసం తమిళనాడు లోని మద్రాస్ హైకోర్టులో దావా దాఖలు చేశారు.
అయితే కోర్టు నళిని శ్రీహరన్(Nalini Sriharan) కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గత జూన్ 17న ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. దీనిని సవాల్ చేస్తూ నళిని శ్రీహరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే తనతో పాటు దోషిగా తేలిన ఏజీ పేరారి వాలన్ ను విడుదల చేసింది కోర్టు మానవతా దృక్ఫథంతో. ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు,
నిందితులకు ప్రాణ భిక్ష పెట్టేందుకు సమ్మతించారు దివంగత ప్రధాని భార్య ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వార్ధా.
ఏజీ పెరారివాలన్ ను విడుదల చేశారు కాబట్టి తనకు కూడా అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు సమర్పించిన పిటిషన్ లో. ఇదిలా ఉండగా నళిని శ్రీహరన్ రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
తనను త్వరగా విడుదల చేయండంటూ కోరారు. ఈ సందర్బంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు అధికారం లేదు. ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉందని స్పష్టం చేసింది.
Also Read : దమ్ముంటే ఈడీ నా ఇంటికి రావచ్చు