DK Shiva Kumar : అమూల్ కంటే ‘నందిని’ బెటర్ – డీకే
నిప్పులు చెరిగిన కేపీసీసీ చీఫ్
DK Shiva Kumar : కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే మే నెలలో పోలింగ్ జరగనుంది. 13న ఎవరు గెలుస్తారో తేలనుంది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా కర్ణాటకలో అమూల్ కు సంబంధించి వివాదం చోటు చేసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో నందిని పేరుతో పాలు, ఇతర పదార్ధాలను పంపిణీ చేస్తున్నారు. తాజాగా దీని స్థానంలో అమూల్ ను తీసుకు రావాలని కర్ణాటక సర్కార్ యత్నిస్తోంది.
ఇది గుజరాత్ కు చెందింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు ప్రధాని మోదీపై. ఇప్పటికే అన్నీ దోచుకున్నారని కర్ణాటకలో ఇంకేం మిగిలి ఉందని ప్రశ్నించారు. ప్రస్తుతం తమ ప్రాంతానికి చెందిన నందిని ప్రాడక్ట్స్ ను కూడా అమ్మకుండా చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. అమూల్ పాల పదార్థాల కంటే తమకు చెందిన నందిని తయారు చేసినవే గొప్పవంటూ పేర్కొన్నారు. అమూల్ ప్రవేశంపై వివాదం నెలకొన్న తరుణంలో స్థానిక రైతులు, డెయిర్ బ్రాండ్ నందినిని రక్షించుకుంటామని స్పష్టం చేశారు డీకే శివకుమార్(DK Shiva Kumar). సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా వదిలి పెట్టమని హెచ్చరించారు.
Also Read : నిధుల కోసం కోటి లేఖల ప్రచారం