Nara Chandra Babu Naidu : నా అరెస్ట్ అక్రమం..అన్యాయం
జడ్జి ముందు టీడీపీ చీఫ్ ఆవేదన
Nara Chandra Babu Naidu : రాజమండ్రి – ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది మరోసారి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు జడ్జి హిమ బిందు. ఈవాల్టివర్కు గడువు విధించడంతో విచారణ చేపట్టింది. వర్చువల్ గా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. ఈ సందర్బంగా జడ్జితో తనకు మాట్లాడడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Nara Chandra Babu Naidu Comment
మీరు భయపడాల్సిన, బాధ పడాల్సిన అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. మీరు పోలీస్ కస్టడీలో ఉన్నారని, జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారని మీరు తప్పు చేసినట్లు కాదని సూచించారు. మీరు నేరం చేయలేదని నిరూపించు కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాను ఏ తప్పు చేయలేదని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). 45 ఏళ్ల పాటు రాజకీయం అనుభవం కలిగి ఉన్నానని ఏనాడూ తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం తాను కృషి చేశానని స్పష్టం చేశారు.
కనీసం తన అనుభవం పరిగణలోకి తీసుకోలేదని, 73 ఏళ్లు దాటిన తనను దారుణంగా అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ చీఫ్. భారీ భద్రత మధ్య చంద్రబాబు నాయుడు వర్చువల్ గా మాట్లాడారు. మరోసారి వర్చువల్ గా తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
Also Read : ACB Court Shock : చంద్రబాబు రిమాండ్ పొడగింపు