Nara Chandrababu Naidu: కార్యకర్తలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ !

కార్యకర్తలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ !

Nara Chandrababu Naidu: పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తానని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్‌స్థాయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు(Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని పేర్కొన్నారు.

Nara Chandrababu Naidu….

అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వందరోజుల్లోనే తెరిపించే కార్యక్రమం ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ గెలవని సీట్లలో కూడా ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టారంటే అది వారు పెట్టుకున్న నమ్మకమని చెప్పారు. కూటమికి 93 శాతం స్ట్రైక్‌ రేట్‌, 57 శాతానికిపైగా ఓట్లు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమిలోని మూడు పార్టీల పాత్ర ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు, నేతలు.. కింది స్థాయి కార్యకర్తలను విస్మరించకూడదన్నారు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారని దిశానిర్దేశం చేశారు.

Also Read : IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు !

Leave A Reply

Your Email Id will not be published!