Nara Lokesh 2500 KM : లోకేష్ 2,500 కిలోమీట‌ర్లు పూర్తి

యువ గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌

Nara Lokesh 2500 KM : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా శ‌నివారం నాటితో 2,500 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్నారు. పేద‌ల కోసం, అణ‌గారిన వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను తెలుసు కునేందుకు తాను ఈ యాత్ర చేప‌ట్టాన‌ని అన్నారు. అడుగ‌డుగునా త‌న‌ను ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

Nara Lokesh 2500 KM Foot March Completed

ఆయ‌న ప్ర‌ధానంగా రాష్ట్రంలో కొలువు తీరిన ఏపీ స‌ర్కార్ పై బాణాలు ఎక్కు పెట్టారు. ప్ర‌ధానంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డిని, ఆయ‌న స‌హ‌చ‌రులైన మంత్రులు, ఎమ్మెల్యేల‌పై విమ‌ర్శ‌లు చేశారు. తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని, త‌మ వారిపై అక్ర‌మంగా కేసులు పెట్టిన వారిని వ‌ద‌ల‌బోమంటూ హెచ్చ‌రించారు.

ఇదే స‌మ‌యంలో తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఏం చేస్తామో కూడా చెప్పారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని , ఇది రాబోయే ఎన్నికల్లో తీర్పు చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేష్(Nara Lokesh). ఇన్ని రోజుల పాటు త‌న‌ను వెన్ను త‌ట్టి ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్న వారికి, న‌న్ను నీడ‌లా కంటికి రెప్ప‌లా చూసుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు .

ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా , ఇంకెన్ని ఇబ్బందులు పెట్టినా త‌న యువ గ‌ళం పాద‌యాత్ర ఆగ‌ద‌న్నారు. ఇది ముందుకు సాగుతూనే ఉంటుంద‌న్నారు నారా లోకేష్. జ‌గ‌న్ రెడ్డి పాల‌న అంతం అయ్యేంత దాకా తాను నిద్ర పోన‌న్నారు.

Also Read : Minister KTR : టెక్నాల‌జీ..సైన్సెస్ కు హైద‌రాబాద్ కేరాఫ్‌

Leave A Reply

Your Email Id will not be published!