Nara Lokesh: వైసీపీ అక్రమ నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం !

వైసీపీ అక్రమ నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం !

Nara Lokesh: ఏపీలో రుషికొండ ప్యాలెస్ రాజకీయాలు సద్దుమణుగకముందే… వైసీపీ అక్రమంగా నిర్మిస్తోన్న పార్టీ కార్యాలయాలపై రాజకీయ దుమారం రేగుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయించడమే కాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు అధికారులు అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించారు. దీనిలో భాగంగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ అధికారులు కూల్చివేసారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసారు.

Nara Lokesh….

ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు. ‘‘జగన్‌.. ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా ! వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూకేటాయింపులు చేశారు. రూ.1000 నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 42 ఎకరాల్లో… 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’’ అని లోకేశ్‌ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

Also Read : Atishi Marlena: త్రాగునీటి కోసం ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష !

Leave A Reply

Your Email Id will not be published!