Nara Lokesh : వయో పరిమితి పెంచాలి – లోకేష్
ఏపీ సీఎం జగన్ రెడ్డికి లేఖ
Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్రంలో గ్రూప్ -1, 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది సర్కార్.
Nara Lokesh Comment
గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించి వయో పరిమితి పెంచాలని లేఖలో కోరారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాజా నోటిపికేషన్ కు సంబంధించి నిరుద్యోగుల పట్ల మానవతా దృక్ఫథంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
జాబ్స్ కు సంబంధించి వయో పరిమితిని 44 ఏళ్లకు పొడిగించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్(Nara Lokesh). ఇందుకు సంబంధించి మరో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీ లోనూ అమలు చేయాలని సీఎంకు హితవు పలికారు.
2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. నిరుద్యోగుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు. జాబ్స్ భర్తీ చేస్తారని అనుకున్న నిరుద్యోగులు ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
Also Read : Chandra Babu Naidu : వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్