Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పేదల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఏపీ సీఎం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.
Nara Lokesh Slams AP CM YS Jagan
ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లోకేష్(Nara Lokesh) డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 1000 కోట్లు బకాయిలు పడ్డారని ఇప్పటి దాకా విడుదల చేయలేదని ఆరోపించారు. దీని వల్ల ఇటు ఆస్పత్రుల యాజమాన్యాలతో పాటు పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్.
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ కు సంబంధించి నిధులు జాప్యం కావడంతో లక్షలాది మంది పేదలకు వైద్యం అందడం లేదని వాపోయారు. వెంటనే ఏపీ సీఎం జగన్ రెడ్డి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆరోగ్య శ్రీ ద్వారా వేలాది మంది చికిత్స పొందుతున్నారని, నిధుల లేమి కారణంగా ఆయా ఆస్పత్రులు చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నాయని ఆవేదన చెందారు. వెంటనే దీనిపై సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు నారా లోకేష్.
Also Read : Srinivas Goud : కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్
