Minister Nara Lokesh: స్టీల్ ప్లాంట్ ప్లాంటును కాపాడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం : మంత్రి లోకేష్
స్టీల్ ప్లాంట్ ప్లాంటును కాపాడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం : మంత్రి లోకేష్
Nara Lokesh: విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందుల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంకి ఎప్పుడు తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తాము చెబుతున్నామని.. స్టీల్ ప్లాంట్ ప్లాంటును కాపాడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు.
Nara Lokesh Comment
విశాఖలో నిర్వహించిన సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. స్టీల్‌ప్లాంట్‌పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారన్నారు. త్వరలోనే ఐటీ పాలసీ వస్తుందని వెల్లడించారు. పారిశ్రామిక వర్గాలతో నేరుగా టచ్‌లోకి వెళ్తున్నామని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు హామిపై స్పష్టంగా ఉన్నామని మంత్రి తెలిపారు. విశాఖకు రాబోవు రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. త్వరలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో రోడ్ షో నిర్వహిస్తానన్నారు. ప్రతి మూడేళ్లకు సర్వర్లు అప్ డేట్ చేయాలన్నారు. డేటా సెంటర్లు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రాబోయే 100 రోజుల్లో ఐటీ పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : AP Government: వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ!