Nara Lokesh: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి ఫిదా అయిన మంత్రి లోకేష్ !
ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి ఫిదా అయిన మంత్రి లోకేష్ !
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… తన నియోజకవర్గంలో ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. వారంలో మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులు పూర్తి చేసి… ప్రజలకు అంకితం చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజలు ఇచ్చే ప్రోత్సాహంతో భవిష్యత్ లో కూడా నెల్లూరు రూరల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత అంకిత భావంతో పని చేస్తానన్నారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడికి, ప్రోత్సహిస్తున్న నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
కోటం రెడ్డిని ప్రశంసిస్తూ మంత్రి లోకేష్ ట్వీట్
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కోటంరెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారన్నారు. బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు.