Nara Lokesh : నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం
జనం మీద పడడంతో ఉక్కిరి బిక్కిరి
Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యువ గళం పాదయాత్రలో భాగంగా దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా జనం మీద పడడడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరికి లోనయ్యారు. తోపులాటలో మూడుసార్లు కింద పడబోయారు లోకేష్. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా వైసీపీ నేతల ఒత్తిడి మేరకు లోకేష్ పాదయాత్రకు సెక్యూరిటీ తగ్గిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించారు.
Nara Lokesh Comments
ఇదిలా ఉండగా యువగళం పాదయాత్ర 172 రోజులకు చేరుకుంది. వేంపాడ్ క్యాంప్ సైట్ నుంచి యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది లోకేష్ కు మద్దతు పలికారు. జగన్ అరాచక పాలనపై తాను పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు నారా(Nara Lokesh). రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ఆరోపించారు. తాము పవర్ లోకి రాగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పెత్తందారుడైన జగన్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు నారా లోకేష్.
పేదల పేరుతో జగన్ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడని ఆరోపించారు నారా లోకేష్. అంతకు ముందు ముండ్లమూరు, పసుపుగల్లు, ఉల్లగల్లు మీదుగా కెలంపల్లి వరకూ పాదయాత్ర సాగింది. వివిధ వర్గాలకు చెందిన నేతలు వినతిపత్రాలు అందజేశారు.
Also Read : Sanju Samson : సంజూ శాంసన్ కు లాస్ట్ ఛాన్స్