Nara Lokesh : రైతుల‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్

నిప్పులు చెరిగిన టీడీపీ నేత లోకేష్

Nara Lokesh : అమ‌రావ‌తి – రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. అన్న‌దాత‌లకు అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను , సాగు నీటి క‌ష్టాల‌ను టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌కు దిగాల‌ని పిలుపునిచ్చారు.

Nara Lokesh Slams YS Jagan

ఇదిలా ఉండ‌గా రైతాంగం ఎదుర్కొంటున్న సాగు నీటి క‌ష్టాల‌పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు నారా లోకేష్. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందన్నారు. అయితే సాగు చేసిన పంటలు కూడా వర్షభావం కారణంగా నీరందక ఎండి పోతున్నాయని వాపోయారు .

ఆదివారం టీడీపీ ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. వర్షాభావ పరిస్థితులు, సాగు నీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. జిల్లాల వారీగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి, రైతుల దీన స్థితిని నేతలు లోకేష్ కు వివరించారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో 70 నుంచి 80 శాతం వర్షపాతం లోటు ఉందని పేర్కొన్నారు. నెల రోజులుగా చినుకు లేక పోవడం, ఎండలు మండుతుండడంతో సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్న విషయాన్ని చర్చించారు.

రాష్ట్రంలో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలు పూర్తిగా మూసి వేశారని…కష్ట కాలంలో రైతులను ఆదుకునేందుకు కనీస స్థాయిలో కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సందర్భంగా లోకేష్(Nara Lokesh) అభిప్రాయపడ్డారు. సబ్సిడీల నిలిపి వేత, పెరిగిన సాగు ఖర్చులతో సతమతం అవుతున్న అన్నదాతలపై కరువు పరిస్థితుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Telangana BJP List : 52 అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!