Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 రోజులకో కొత్త కేసు పెడతారని , ఆ దిశగా ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Nara Lokesh Comment
భయం అన్నది జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుచరులకు ఉండవచ్చేమో కానీ తమ బ్లడ్ లో లేనే లేదని పేర్కొన్నారు నారా లోకేష్(Nara Lokesh). ఎవరైనా కాదని అడ్డొచ్చే ప్రయత్నం చేస్తే వారు ఎవరున్నా చూడమని, తొక్కుకుంటూ పోతామని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఓపికతో ఉన్నామని కానీ రాబోయే రోజుల్లో ఆ ఓపిక కూడా నశించే ప్రమాదం ఉందన్నారు నారా లోకేష్.
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయనకు రిమాండ్ శిక్ష విధించారు. 53 రోజుల పాటు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. తన కంటికి ఆపరేషన్ చేయించు కునేందుకు అని బెయిల్ కోరారు. ఈ మేరకు కోర్టు కొన్నికండీషన్స్ తో హైకోర్టు విడుదల చేసింది. దీంతో ఇవాళ ఎల్ వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు.
Also Read : AP CM YS Jagan : రైతు భరోసా కింద రూ. 2,204.77 కోట్లు