Nara Lokesh : ప్రజా సంక్షేమం టీడీపీ లక్ష్యం – లోకేష్
యువ గళం పాదయాత్రలో నేత
Nara Lokesh : ప్రజా సంక్షేమమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆదివారం ఆయన చేపట్టిన యువ గళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఆయన వెంట మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు. నారా లోకేష్(Nara Lokesh) కు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్బంగా తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము గనుక అధికారంలోకి వస్తే ప్రజా రంజక పాలన అందజేస్తామన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ పవర్ లోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనాన్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు నారా లోకేష్.
జగన్ ను అడ్డం పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చి పోతున్నారని, ఇసుక, ల్యాండ్ మాఫియాగా మారి పోయారని రాష్ట్ర అభివృద్దిని పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కూడా సీఎంకే దక్కిందన్నారు. ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
ఇంకెంత కాలం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారని, తాము పవర్ లోకి వస్తామని జోష్యం చెప్పారు.
Also Read : Project K Movie : ప్రాజెక్టు కె మూవీపై ఉత్కంఠ