Nara Lokesh : జాబ్స్ ఇవ్వడంలో జగన్ విఫలం
నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెరిగిందని, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడడంలో ఉండేందుకు ప్రధాన కారకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు.
Nara Lokesh Comments on AP CM YS Jagan
మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎందుకు ఏపీ ఉద్యోగాలను కల్పించడంలో ఫోకస్ పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి పెరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు నారా లోకేష్.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జగన్ వచ్చాక పూర్తిగా సర్వ నాశనం చేశాడని, నిరుద్యోగులు, యువత ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆరోపించారు. దీంతో నిరాశ, నిస్పృహలతో ఉన్నారని వారికి ఈ విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
అర్హతలు ఉండి , విభిన్న రంగాలలో ప్రతిభ కలిగిన వారికి అవసరమైన మేరకు జాబ్స్ ఇవ్వాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందన్నారు నారా లోకేష్. ఇకనైనా జగన్ మారాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు .
Also Read : AP CM YS Jagan : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు