Nara Lokesh : అరాచక పాలనతో జనం ఆగమాగం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). యువ గళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పాద యాత్ర 120 రోజులు పూర్తి కాగా ఇవాళ్టితో 121వ రోజు. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు నారా లోకేష్. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇప్పటికే మిషన్ రాయలసీమను ప్రకటించారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలను అభివృద్ది పథంలో పయనించేలా చేస్తామని అన్నారు నారా లోకేష్. చలమారెడ్డిపల్లి మీదుగా టక్కోలు వద్ద రాజంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా పెద్ద ఎత్తున జనం ఘన స్వాగతం పలికారు. టక్కోలులో గ్రామస్థులు, రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్నా క్రాస్ , మాచుపల్లి మీదుగా యాత్ర సాగింది.
అంతకు ముందు కడప లోని విడిది కేంద్రంలో న్యాయవాదులు, పాస్టర్లు, పులివెందుల పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. వివిధ అంశాలపై ముఖా ముఖి చర్చించారు. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి అరాచక పాలనలో జనం దిక్కు తోచని స్థితిలో పడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
Also Read : Sonia Gandhi Painting : ఆకట్టుకున్న సోనియా చిత్రం