Nara Lokesh : ఇసుక మాఫియా దెబ్బకు పెన్నా విలవిల
నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. యువ గళం పాదయాత్రలో భాగంగా ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఆదివారం బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటిని చూపిస్తూ ప్రజలను ప్రశ్నించారు.
వైఎస్సార్ పార్టీ నాయకులు ఇసుకాసురులుగా మారి పోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేతలంతా ఇసుక మాఫియాగా ఏర్పడ్డారని , చివరకు పెన్నా నదిని కూడా వదలడం లేదంటూ మండిపడ్డారు. దీంతో ఇసుక లేకుండా పోయిందని , ప్రతి రోజూ లారీలలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని వాపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించారు.
జగన్ పాలనలో దోపిడీ రాజ్యం కొనసాగుతోందన్నారు. అడిగితే దాడులు, ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు నారా లోకేష్(Nara Lokesh). ప్రజలు నెత్తీ నోరు మొత్తుకున్నా పట్టించు కోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. టిప్పర్ డ్రైవర్ ను అడిగితే బెంగళూరుకు తరలిస్తున్నామని సమాధానం ఇచ్చారని చెప్పారు లోకేష్. జగన్ పాలనలో ఇంకెన్నిసిత్రాలు చూడాలో అని ఆయన ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : PM Modi : సవాళ్లను ఎదుర్కొంటేనే రాణించగలం
