Nara Lokesh: ఆరోగ్యం జాగ్రత్త అంటూ మంత్రి నిమ్మలకు నారా లోకేశ్ స్వీట్ వార్నింగ్
ఆరోగ్యం జాగ్రత్త అంటూ మంత్రి నిమ్మలకు నారా లోకేశ్ స్వీట్ వార్నింగ్
Nara Lokesh : ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య అసెంబ్లీ లాబీలో ఆశక్తికరమైన సంభాషణ జరిగింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంత్రి రామానాయుడు… తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో చేతికి సెలైన్ ఎక్కించే ఐవీ క్యానులాతో అసెంబ్లీ లాబీలో ఎదుటపడిన మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పరామర్శించారు.
అనారోగ్యంతో రెస్ట్ తీసుకోకుండా అసెంబ్లీకు రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పనిచేస్తానంటే ఇక మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందే అన్నారు. నిన్నటి వరకూ ఒక చేతికి సిలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని శుక్రవారం మరో చేతికి పెట్టుకుని తిరుగుతూంటే ఆరోగ్యం ఏం కావాలన్నారు. ఆరోగ్యం కుదుట పడిన తరువాత మీరు రావచ్చు… అంతవరకు మీరు రెస్ట్ తీసుకొండని సూచించారు. అయితే దీనికి నిమ్మల ఫరవాలేదు అని చెప్పడంతో… మీరు రెస్ట్ తీసుకుంటారా లేకపోతే స్పీకర్ నుండి రూలింగ్ ఇప్పించి సభ నుండి సస్పెండ్ చేయించాలా అని రామానాయుడిని హెచ్చరించారు.
Minister Nara Lokesh Meet
అయినప్పటికీ నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అసెంబ్లీకు హాజరుకావడంతో… అతని ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ చర్చించారు. నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు. దీనికి మరో సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.
లోకేష్ వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ… నిన్నటి మీద ఆరోగ్యం కొంచెం బాగానే ఉందని… అందుకే వచ్చానని అన్నారు. విశ్రాంతితో కూడిన ప్రశాంత నిద్రతోనే ఆరోగ్యం కుదుటపడుతుందని లోకేశ్ అన్నారు. మాట వినకుంటే తన యాపిల్ వాచ్ ని ఇక రామానాయుడు చేతికి పెట్టి నిద్రను తాను మానిటర్ చేస్తానని లోకేశ్ అన్నారు. తాను పని ఒత్తిడికి గురైనప్పుడు ఓ 15 నిమిషాలు టీవీ చూస్తూ పడుకుంటే తర్వాత ఎంతో రిలాక్స్‌గా ఉంటుందని లోకేశ్ అన్నారు. ఈ పద్ధతి ప్రయత్నించి చూడాలని రామానాయుడుకు సూచించారు.
Also Read : CM Chandrababu Naidu: వాచ్ మెన్ రంగయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం