Narasaraopeta Court: నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు ! తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష !

నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు ! తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష !

Narasaraopeta Court : నరసరావుపేట కోర్టు మహిళ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఓ మహిళ హత్య కేసులో నిందితుడు తన్నీరు అంకమ్మరావు (30)కి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ నేతి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. నరసరావుపేటలో 2023 మే 5న సలీమా అనే మహిళను అతడు దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మూడు హత్య కేసుల్లో నిందితుడైన తన్నీరు అంకమ్మరావుకు అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు(Narasaraopeta Court) చరిత్రలో తొలిసారి న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. కాగా ప్రస్తుతం నిందితుడు అంకమ్మరావు మరో రెండు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. నరసరావుపేట(Narasaraopeta)లో నిందితుడు తన్నీరు అంకమ్మరావు మూడు హత్యలు చేసి జైల్లో ఉన్నాడు. జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Narasaraopeta Court Sensational Verdict

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మే, 2023లో ఒకేసారి జంట హత్యలు వెలుగు చూశాయి. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు రూ. 150 కోసం దారుణంగా హత్యచేసినట్లు తెలిపారు. ముందుగా పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీలను చూసి మద్యం మత్తులో కింద పడి మృతి చెంది ఉంటారని భావించారు. రెండు డెడ్ బాడీలపై ఒకేరకమైన గాయలు ఉండటంతో అనుమానస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఈ హత్యలు చేసింది నిందితుడు తన్నీరు అంకమ్మరావుగా గుర్తించి అరెస్టు చేశారు.

రైల్వే స్టేషన్‌ రోడ్డులో నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్ద రూ.30 తీసుకుని అంకమ్మరావు అతడిని బండరాయితో బాది హత్య చేసాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తి వద్ద రూ.120 తీసుకుని అదే రీతిలో బండ రాయితో చంపేశాడు. ఇక ఈ రెండు హత్యలతో 2023, మే 5న రూ.400 కోసం ఓ యాచకురాలి హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించగా అందులోనూ అంకమ్మరావే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు.

Also Read : CM Revanth Reddy: సరస్వతీ నది పుష్కరస్నానమాచరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!