Narayana Case : నారాయణ కేసుపై విచారణ
నవంబర్ 1కి వాయిదా వేసిన కోర్టు
Narayana Case : అమరావతి – ఏపీ మాజీ మంత్రి , నారాయణ విద్యా సంస్థల చైర్మన్ కొనకళ్ల నారాయణకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీ సీఐడీ నారాయణతో పాటు ఆయన అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో ఇరికించింది. ఈ మేరకు పలువురిపై కేసు నమోదు చేసింది. ఇదే కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి నారాయణ.
Narayana Case Viral
ఆయన తరపున లాయర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఇదే కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది హైకోర్టు. ఇదిలా ఉండగా తాను దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీ సీఐడీపై తీవ్ర ఆరోపణలు చేశారు నారాయణ(Narayana). తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తనను చేర్చారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్థించారు.
తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో రెండు పిటిషన్లపై హకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను వచ్చే నెల ఒకటికి వాయిదా వేసింది అమరావతి హైకోర్టు. మొత్తంగా నారాయణ అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు.
Also Read : AP High Court : అమరావతి ల్యాండ్ కేసు వాయిదా