Narendra Modi: అవినీతి పరులపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు !

అవినీతి పరులపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు !

Narendra Modi: లోక్‌ సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌ కు ముందు అవినీతి పరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేసారు. పశ్చిమ బెంగాల్ లోని పురిలియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ… ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని… దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని అన్నారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నా…. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను.

Narendra Modi Serious Comments

జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అనంతరం అవినీతిపరులు వారి పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ(Narendra Modi) వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అదే సమయంలో విపక్షాల నుండి మోదీ, బీజేపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవినీతి పరులను జైల్లో పెట్టాలంటే… ఒక్క బీజేపీ, లేదా దాని కూటమి పార్టీల నాయకులు బయట ఉండరని…. వారితో దేశంలో ఉన్న జైళ్ళన్నీ కిక్కిరిసిపోతాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సోమవారం నాలుగో దశ పోలింగ్ !

కాగా లోక్‌సభ ఎన్నికలు-2024 ఐదవ దశకు సర్వసిద్ధమైంది. సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ విడత ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌ లో 7, బిహార్, ఒడిశాలో 5, ఝార్ఖండ్ 3 స్థానాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజక వర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఐదో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వ రులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ వ్యక్తుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ, లఖ్‌నవూ నుంచి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సనర్ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య, జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు.

Also Read : CM Revanth Reddy : ఈరోజు తెలంగాణలో అత్యవసర మంత్రివర్గ సమావేశం

Leave A Reply

Your Email Id will not be published!