Nasser Hussain : ఐసీసీ షెడ్యూల్ పై హుస్సేన్ ఫైర్

మానసికంగా క్రికెట‌ర్లకు ఇబ్బందే

Nasser Hussain : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) తాజాగా ఫ్యూచ‌ర్ టూర్ ప్రోగ్రామ్స్ పేరుతో ముంద‌స్తు మ్యాచ్ ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల ఆయా జ‌ట్ల‌కు ఎలాంటి విశ్రాంతి అంటూ ఉండ‌దు.

దీని వ‌ల్ల శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్రంగా అల‌సి పోతార‌ని చివ‌ర‌కు అసలైన క్రికెట్ ఆట‌ను ఆడ‌కుండా మ‌రిచి పోయే చాన్స్ ఎక్కువ‌గా ఉంద‌న్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ నాస‌ర్ హుస్సేన్(Nasser Hussain). ఐసీసీ డిక్లేర్ చేసిన క్రికెట్ బిజీ షెడ్యూల్ పై ఆయ‌న సెటైర్ వేశారు.

ఒక ర‌కంగా దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌న్నారు. ఇలాంటి చెత్త నిర్ణ‌యాల వ‌ల్ల చాలా మంది ప్ర‌ముఖ ఆట‌గాళ్లు ఆడ‌లేక , స‌మ‌యం కేటాయించ లేక చేతులెత్తేస్తున్నారంటూ ఆరోపించాడు.

దీని వ‌ల్ల ప్ర‌ధాన క్రికెట‌ర్లంతా క్రికెట్ కు ఒక్క‌రొక్క‌రు దూర‌మ‌య్యే ప్రమాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించాడు నాస‌ర్ హుస్సేన్. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా తాజాగా వ‌న్డే మ్యాచ్ ల నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన బెన్ స్టోక్స్(Ben Stokes) గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు ఈ మాజీ క్రికెట‌ర్.

ఇంగ్లండ్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన టీంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని కితాబు ఇచ్చాడు. కానీ అలాంటి ఆట‌గాడు ఇలా ఉన్న‌ట్టుండి ప‌దవీ విర‌మ‌ణ చేయ‌డం తాను త‌ట్టుకోలేక పోతున్న‌ట్లు తెలిపాడు.

మొత్తంగా ఐసీసీ నిర్వాకం కార‌ణంగా ఇలా క్రికెట్ కు ఓ ప‌ద్ద‌తి లేకుండా పోయిందంటూ పేర్కొన్నాడు. ఇప్ప‌టికైనా ఫ్యూచ‌ర్ టూర్ ప్రోగ్రామ్ గురించి పున‌రాలోచించాల‌ని నాస‌ర్ హుస్సేన్ సూచించాడు.

Also Read : విండీస్ స్టార్ ఓపెన‌ర్ సిమ‌న్స్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!