Subramanian Swamy : అదానీ ఆస్తుల‌ను జాతీయం చేయండి

పీఎంకు సుబ్ర‌మ‌ణ్య స్వామి స‌లహా

Subramanian Swamy : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు అదానీ గ్రూప్ విల‌విల లాడుతోంది. భారీ ఎత్తున మోసాల‌కు పాల్ప‌డిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఉన్న‌ట్టుండి షేర్లు పెద్ద ఎత్తున ప‌డి పోయాయి. దీంతో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతం అదానీ ఉన్న‌ట్టుండి 11వ స్థానానికి దిగ‌జారాడు.

గ‌తంలో రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీని దాటేసిన అదానీ ఉన్న‌ట్టుండి షేర్ల ప‌త‌నంతో మ‌రింత వెనుక‌బ‌డ్డాడు. రాబోయే రోజుల్లో ఇంకెంత ప‌త‌నం జ‌రుగుతుంద‌నే దానిపై ఆందోళ‌న చెందుతున్నారు ఇన్వెష్ట‌ర్లు. దీంతో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

వెంట‌నే అదానీ గ్రూప్ తీసుకున్న రుణాల వివ‌రాలు ఇవ్వాలంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ మొత్తం అదానీ గ్రూప్ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు బీజేపీ మాజీ ఎంపీ , సీనియ‌ర్ నాయ‌కుడు , ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య స్వామి(Subramanian Swamy). అదానీ గ్రూప్ కు చెందిన ఆస్తుల‌ను జాతీయం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు వెంట‌నే పీఎం న‌రేంద్ర మోదీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేక‌పోతే విశ్వ‌స‌నీయ‌త దెబ్బ తింటుంద‌ని హెచ్చ‌రించారు. ఆ ఆస్తుల‌ను త‌ర్వాత అమ్మ‌కానికి పెట్టాల‌ని సూచించారు మాజీ ఎంపీ. ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ లో ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున స‌ర్కార్ పై ఫైర్ అయ్యాయి. అదానీ గ్రూప్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌రిపించాలంటూ డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. స్వామి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : అదానీ గ్రూప్ కు సిటీ గ్రూప్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!