Naveen Patnaik: సీఎం పదవికి నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా ! ఒడిశా తదుపరి సీఎం ఎవరో ?

సీఎం పదవికి నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా ! ఒడిశా తదుపరి సీఎం ఎవరో ?

Naveen Patnaik: ఒడిశాను 24ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు తొలిసారి ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే దాన్ని ఆమోదిస్తున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు తాత్కాలిక సీఎంగా కొనసాగమని కోరారు.

ఒడిశా అసెంబ్లీతో పాటు లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాలతో మెజార్టీ మార్కును దాటింది. బిజద 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అటు మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు 20చోట్ల బీజేపీ విజయం సాధించగా, ఒకచోట కాంగ్రెస్‌ గెలుపొందింది. బిజూ జనతాదళ్‌ (బిజద) ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

Naveen Patnaik – కొత్త సీఎం ఎవరో ?

రెండున్నర దశబ్దాల తర్వాత రాష్ట్ర సీఎంగా కొత్త వ్యక్తి రానుండటంపై ఆ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్‌ పండ ముఖ్యమంత్రి అభ్యర్థి జాబితాలో ముందున్నారు. అయితే, వీరంతా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడంతో ఒడిశా సీఎంగా కాషాయ పార్టీ కొత్తవారిని పరిచయం చేసే అవకాశం ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నవీన్‌ పట్నాయక్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకువస్తుందనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read : Harsh Goenka: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు !

Leave A Reply

Your Email Id will not be published!