Naveen Reddy Kidnap : పోలీస్ క‌స్ట‌డీకి న‌వీన్ రెడ్డి

డాక్ట‌ర్ అశ్విని రెడ్డి కేసు

Naveen Reddy Kidnap : ఇరు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపిన మ‌న్నెగూడ యువ‌తి కిడ్నాప్ కేసులో కీల‌క నిందితుడైన మిష్టర్ టీ ఫౌండర్ న‌వీన్ రెడ్డిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కోర్టు మూడు రోజుల పాటు విచార‌ణ జ‌రిపేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. నేటి నుంచి సోమ‌వారం వ‌ర‌కు న‌వీన్ రెడ్డిని విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.

ఇప్ప‌టికే చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్న న‌వీన్ రెడ్డి ని ఆదిభ‌ట్ల పోలీస్ స్టేష‌స్ కు త‌ర‌లిస్తున్నారు. ఫ‌క్తు సినిమా ఫ‌క్కీలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. దేశ వ్యాప్తంగా యువ‌తి కిడ్నాప్, విడుద‌ల కేసు క‌ల‌క‌లం రేపింది. ఒక ర‌కంగా తెలంగాణ పోలీసుల‌కు స‌వాల్ గా మారింది. యువ‌తి ఇంటి పైకి 75 మందికి పైగా అనుచ‌రుల‌తో న‌వీన్ రెడ్డి(Naveen Reddy) దాడికి పాల్ప‌డ్డాడు.

ఆపై స‌ద‌రు డెంటల్ డాక్ట‌ర్ ను ఎత్తుకెళ్లాడు. బాధితురాలి పేరెంట్స్ రోడ్డు పైకి రావ‌డంతో క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో యువ‌తిని వ‌దిలేసి న‌వీన్ రెడ్డి గోవాకు పారి పోయాడు.

అక్క‌డ కొన్ని రోజుల త‌ర్వాత పోలీసుల‌కు ప‌ట్టు బ‌డ్డాడు. అప్ప‌టి వ‌ర‌కు ట్విస్ట్ లు కొన‌సాగుతూ వ‌చ్చాయి ఈ కేసుకు సంబంధించి.ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

ఈ కేసులో ఇప్ప‌టికే కీల‌క విష‌యాలు రాబ‌ట్టారు న‌వీన్ రెడ్డి నుంచి. ఏడు రోజుల ముందే ప్లాన్ చేశాడు కిడ్నాప్ చేసేందుకు. దాడి చేశాక త‌న వోల్వో కారులో ఎక్కించుకుని వెళ్లాఉ. చందు డ్రైవింగ్ చేస్తుండ‌గా సిద్దు ముందు సీటులో కూర్చున్నాడు.

వైశాలీని మ‌ధ్య సీట్లో కూర్చో బెట్టుకుని నవీన్ రెడ్డి(Naveen Reddy), రుమాన్ , సాయి నాథ్ , నాగ‌రాజు దాడి చేశారు. పోలీసుల క‌న్ను గ‌ప్పేందుకు త‌న ఫోన్ ను వేరే కారులో విజ‌య‌వాడ రూట్ లో వెళ్లేలా ప్లాన్ చేశాడు. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు పొక్క‌డంతో మ‌న్నెగూడ ఆర్టీఏ ఆఫీసు వ‌ద్ద అశ్వినిని వ‌దిలి వెళ్లారు.

అక్క‌డి నుంచి చెక్కేశారు. న‌వీన్ రెడ్డి త‌న కారును శంషాబాద్ పాత ఊరు వ‌ద్ద వ‌దిలి గోవాకు పారి పోయాడు. అత‌డిని ట్రేస్ చేసి ఈనెల 14న ప‌ట్టుకున్నారు.

Also Read : రాహుల్ గాంధీ అంటే బీజేపీకి భ‌యం

Leave A Reply

Your Email Id will not be published!