Sidhu AAP : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని 117 సీట్లలో స్పష్టమైన మెజారిటీని సాధించి ఇంకా ముందుకు వెళుతోంది. ఇప్పటి వరకు 90 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
ఈ తరుణంలో అధికారంలోకి రావాలంటే 59 సీట్లు కావాలి. ఆ మార్క్ ను ఎప్పుడో దాటేసింది.
ఈ తరుణంలో ఎన్నికల సరళిపై స్పందించారు. మాజీ క్రికెటర్ , పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.
ఈ మేరకు ఆయన ఆప్ (Sidhu AAP) ను అభినందించారు. ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించిన భగవంత్ మాన్ కు గ్రీటింగ్స్ తెలిపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసా వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. పంజాల్ ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు దేవుడు ఇచ్చిన తీర్పు గా తాను భావిస్తానని తెలిపారు సిద్దూ.
ప్రజా స్వామ్యంలో గెలుపు ఓటములు అన్నవి మామూలేనని అన్నారు. కడపటి వార్తలు
అందేసరికి అమృత్ సర్ ఈస్ట్ నుంచి సిద్దూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ బిక్రమ్ సింగ్ మజిథియా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం.
విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీతో జత కట్టిన పంజాబ్ మాజీ సీఎం , పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం వెనుకంజలో ఉండడం విశేషం.
ఆప్ చీపురు దెబ్బకు మహా మహులు మట్టి కరిచారు. కాగా కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాటలే ఆ పార్టీని కొంప ముంచేలా చేశాయి.
Also Read : కాంగ్రెస్ స్వయం కృతాపరాధం