Navjot Singh Sidhu : భగవంత్ మాన్ పై భగ్గుమన్న సిద్దూ
తనకు భద్రత తగ్గించడంపై ఆగ్రహం
Navjot Singh Sidhu : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) నిప్పులు చెరిగారు. ఆయన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై విరుచుకు పడ్డారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న సెక్యూరిటీని పంజాబ్ సర్కార్ ఎందుకు తగ్గించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సీఎం కావాలని చేస్తున్న ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతే పాలన సాగించడం కష్టమవుతుందని హెచ్చరించారు. మాన్ ను ఉద్దేశించి మోస్ట్ ప్రొటెక్టెడ్ సీఎం అంటూ పిలిచారు. హత్యకు గురైన గాయకుడు సిద్దూ మూసేవాలా భద్రతను తగ్గించడం, దానిని బహిరంగ పర్చడంపై మాన్ సర్కార్ ను నిలదీశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ నిప్పులు చెరిగారు.
గత ఏడాది మేలో జరిగిన పంజాబీ సింగర్ హత్యపై మాన్సా జిల్లాలో మూసే వాలా తల్లిదండ్రులను సిద్దూ(Sidhu Moose Wala) సందర్శించారు. వారికి భరోసా కల్పించారు. పంజాబ్ పోలీసులు తాత్కాలిక ప్రాతిపదికన భద్రతను తగ్గించిన 424 మందిలో మూసేవాలా కూడా ఉన్నారు. 1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో దాదాపు 10 నెలల శిక్ష అనుభవించిన తర్వాత క్రికెటర్ నుంచి రాజకీయవేత్తగా మారిన సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు.
Also Read : రాహుల్ కామెంట్స్ ఫడ్నవీస్ సీరియస్