#Nayanthara : ఫిబ్రవరిలో సూపర్ స్టార్ నయనతార పెళ్లి?

Nayanthara : గత ఏడాది కరోనా సమయంలో సినీ నటి నటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. 2 నెలల క్రితం హీరోయిన్ కాజల్, నిహారిక కొణిదెల పెళ్లిళ్లు జరుగాయి..

Nayanthara : గత ఏడాది కరోనా సమయంలో సినీ నటి నటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. 2 నెలల క్రితం హీరోయిన్ కాజల్, నిహారిక కొణిదెల పెళ్లిళ్లు జరుగాయి.. ఇటీవలే సాయి పల్లవి పెళ్లి గురించి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోగా.. మరో హీరోయిన్ పెళ్ళికి సిద్ధంగా ఉందని వార్తలు వచ్చాయి.

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటిఫుల్ నటి నయనతార. తను నటించే సినిమాలలో పాత్రలకు ప్రాణం పోసే నటి. కాగా ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిపింది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో గత కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో ఓ చర్చిలో కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని తెలిపారు.

ఇదిలా ఉండగా విఘ్నేష్ శివన్ కు ముందు తను మరో హీరో తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు మరో డైరెక్టర్ శింబు నయనతారల మధ్య ప్రేమాయణం గురించి అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. కాగా ప్రభుదేవా తో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉండగా తాను నటించిన ఓ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. కాగా నయన ఇప్పటికి పెళ్ళికి సిద్ధంగా లేకున్నా.. విఘ్నేష్ కుటుంబ సభ్యులు తొందర పెట్టడంతో ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

కాగా ప్రస్తుతం నయనతార రజనీకాంత్ తో ఆ సినిమాలో నటిస్తుండగా.. తన కాబోయే భర్త విఘ్నేష్ తో కలిసి రెండు సినిమాలలో నటిస్తుంది. అంతేకాకుండా సుశీ గణేషన్ హిస్టారిక్ మూవీ లో నయనతారను ఎంపిక చేశారు. కాగా ఈ సినిమాలో నయన పాత్ర ఓ వీర వనితగా నటించడానికి చిత్రబృందం నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికీ నయనా నుండి ఈ సినిమా పై ఎటువంటి సమాచారం అందలేదు.

No comment allowed please