Sharad Pawar Shinde : సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ
ప్రాధాన్యత సంతరించుకున్న ములాఖత్
Sharad Pawar Shinde : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో(Shinde) భేటీ అయ్యారు. వీరిద్దరూ గంటకు పైగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరాఠా రాజకీయాలలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా తాను సీఎం షిండేను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ పరమైన కారణాలు ఏవీ లేవని పేర్కొన్నారు శరద్ పవార్. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఎన్సీపీ చీఫ్.
ముంబై లోని మరాఠా మందిర్ అమృత్ మహోత్సవ్ వార్షకోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమానికి సీఎం షిండేను ఆహ్వానించేందుకు మాత్రమే కలిశానని అంతకు తప్ప వేరే కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు శరద్ పవార్.
ఇదిలా ఉండగా గత ఏడాది మహా వికాస్ అఘాడి (ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ) ప్రభుత్వం కూలి పోయిన తర్వాత ఈ సమావేశం షీండే, పవార్ మధ్య జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే ఎజెండా అస్పష్టంగా ఉన్నందున వీరిద్దరి ములాఖత్ చాలా ఊహాగానాలకు తెర తీసింది. అయితే మరాఠీ సినిమా, థియేటర్ , ఆర్ట్ రంగానికి చెందిన కళాకారుల సమస్యలను తెలుసు కునేందుకు సమావేశం నిర్వహించడంపై కూడా చర్చించారు వీరిద్దరూ.
Also Read : Kejriwal MK Stalin