Governor Abdul Nazeer: ప్రభుత్వ ఏర్పాటుకోసం గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు !
ప్రభుత్వ ఏర్పాటుకోసం గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు !
Governor Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. విజయవాడలో మంగళవారం ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును వారంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి నేతలు గవర్నర్ ను కలిసి కోరారు.
Governor Abdul Nazeer Meet
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్ నజీర్‌కు(Governor Abdul Nazeer) లేఖ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్… ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా… ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు. ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
Also Read : Nara Chandrababu Naidu: చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు !